ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పెద్ద చర్చకు తెరలేపింది అనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ క్రికెట్ టీం కి ప్రస్తుతం కెప్టెన్ గా నేతృత్వం వహిస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ను నాలుగు మ్యాచ్ లలో పాల్గొనకుండా నిషేధాన్ని విధించింది ఐసీసీ.
ఈ నిషేధం లో భాగం గా సర్ఫరాజ్ అహ్మద్ తన టీం రాబోయే రోజుల్లో సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ జట్టు తో తలపడే చివరి రెండు వన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ లు ఇంకా అదే దేశం తో పాకిస్తాన్ ఆడబోయే టీ20 సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లలో పాల్గొనటానికి వీలు లేదు.
అయితే, ఐసీసీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటని పాకిస్తాన్ లోని సర్ఫరాజ్ అహ్మద్ అభిమానులు ప్రస్తుతం నెట్టింట్లో వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇండియా నే గాక మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.
సౌత్ ఆఫ్రికా కి, ఈ విషయానికి సంబంధం ఏంటనే గా మీ ప్రశ్న, ఎందుకంటే, సర్ఫరాజ్ అహ్మద్ సౌత్ ఆఫ్రికన్ ఆల్ రౌండర్ క్రికెటర్ అయిన అండీలే ఫెహ్లు క్వాయో పై జాతి వివక్ష, విద్వేషిత పూరితమైన కామెంట్ చేసాడు. సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ లో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లో భాగం గా సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు పాకిస్తాన్ తో తలపడుతోంది.
అయితే, జరిగిన పోయిన మ్యాచ్ లో స్టంప్స్ దగ్గర నుంచున్న సర్ఫరాజ్ అహ్మద్, అండీలే ఫెహ్లు క్వాయో ని ఆట నుంచి అతడి యొక్క దృష్టిని మళ్లించడానికి ఈ విధం గా చేసి ఉంటాడనే విషయం మనకు స్పష్టం గా అర్ధం అవుతోంది.
అసలు సర్ఫరాజ్ అహ్మద్ ఏమని కామెంట్ చేసాడంటే, “అబే కాలే, తేరి అమ్మి ఆజ్ కహా బైటి హై? క్యా పర్వా కే ఆయే హై ఆజ్ (అరేయ్ నల్లోడా, నీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుని ఉంది? తను నీ గురించి ఇవాళ ఏం చెబుతుందనుకుంటున్నావ్), ” అని జుబుక్సా కరమైన భాష ను ఉపయోగించి అండీలే ఫెహ్లు క్వాయో ని వెనకాల నుంచి తిట్టిపోస్తుండగా, దగ్గర్లో ఉన్న స్టంప్స్ యొక్క చిన్న మైక్ కి తన ఈ మాటలు చిక్కాయి. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగియగా మిగతా రెండు మ్యాచ్ లను తన విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు గాను సర్ఫరాజ్ అహ్మద్ మిస్ అవుతాడు.
ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసిన సర్ఫరాజ్ అహ్మద్ యొక్క వ్యాఖ్యలు, అతడి యొక్క మొత్తం ఇమేజ్ ని అతడికి ఉన్న మంచి గౌరవాన్ని డామేజ్ చేశాయనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే, సొంత దేశం నుంచే అతడికి వ్యతిరేకం గా అనేక రకాలైన కామెంట్స్ వెలువడుతున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్ యొక్క అభిమానులు కూడా వారి అభిమాన ఆటగాడు ఈ విధం గా ప్రవర్తించాడు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అని పాకిస్తాన్ లోని మీడియా సంస్థలే వార్తలు రాయడం మనం గమనించాల్సిన విషయం.
వీటికి తోడు, పాకిస్తాన్ దేశ క్రికెట్ జట్టు లో సీనియర్ ఆటగాడు ఇంకా మంచి పేసర్ గా గుర్తింపు తెచుకున్నటువంటి షోయబ్ అఖ్తర్ కూడా ఈ విషయమై స్పందించినట్లు మనకు సమాచారం అందుతోంది. సర్ఫరాజ్ అహ్మద్, సౌత్ ఆఫ్రికా జట్టు కి ముఖ్యం గా అండీలే ఫెహ్లు క్వాయో కి ఎంత త్వరగా క్షమాపణ చెపితే అంత మంచిదని అతడి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినట్లు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక వారు వెల్లడించారు.
తనమీద వస్తున్న వ్యతిరేకతను గమనించిన సర్ఫరాజ్ అహ్మద్, పోయిన శుక్రవారం రోజు తెల్లవారుజామున అండీలే ఫెహ్లు క్వాయో ని తాను స్వయం గా కలిసి క్షమాపణ కోరానని తన ట్విట్టర్ ఖాతాలో వెలిబుచ్చాడు.
Be the first to comment on "పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై నిషేధం విధించిన ఐసీసీ"