భారత దేశ క్రికెట్ లో అతి తక్కువ సమయం లో ఒక మంచి బౌలర్ గా ఇంకా ఒక అత్యుత్తమ కుడి చేతి వాటం కలిగిన లెగ్ స్పిన్నర్ గా మంచి పేరు సంపాదించిన యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత విషయాలను తన యొక్క అభిమానులతో షేర్ చేసుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్ XI కి కెప్టెన్ గా నేతృత్వం వహిస్తున్న మన బెస్ట్ ఇండియన్ విమెన్ క్రికెటర్ స్మ్రితి మంధన యుజ్వేంద్ర చాహల్ ని పొగడ్తలతో ముంచెత్తింది.
చాహల్ ఆమెకు క్రికెట్ లో మంచి ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ గా నిలుస్తాడు అని చెపుతోంది స్మ్రితి మంధన. ఇక ఈ మధ్య కాలం లో తన ఫాస్ట్ బౌలింగ్ తో వికెట్లను పడగొట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న మహమ్మద్ షమీ ఏమో యుజ్వేంద్ర చాహల్ కొంటె పనులు చేయడం లో దిట్ట అని చెబుతున్నాడు.
అయితే చాహల్ మాత్రం తనకు చాలా సిగ్గు అని హిందూస్తాన్ టైమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి తాను వివరించాడు. తనకు చాలానే సిగ్గు ఉన్నప్పటికీ కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లో ఉండే బిందాస్ ఆటిట్యూడ్ నచ్చుతుందట. రణ్వీర్ సింగ్ లాగా బిందాస్ గా జీవితాన్ని గడపాలనిపిస్తుంది అంటున్నాడు మన లెగ్ స్పిన్నర్.
చాహల్ టీవీ అనేది ప్రారంభించాక తన లో ఉన్న బిడియం ఇంకా సిగ్గు కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయని, తన లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని హిందూస్తాన్ టైమ్స్ వారికి వివరించాడు యుజ్వేంద్ర చాహల్. ఏదో సరదాగా ఇంటర్నేషనల్ ఇంకా డొమెస్టిక్ మ్యాచ్ ల కోసం బస్సు లలో ప్రయాణం చేసేటప్పుడు చేసిన పనే చాహల్ టీవీ. అందులో బస్సు లో ఉన్న ఇతర క్రీడా కారులను ఇంటర్వ్యూ చేయడమే యుజ్వేంద్ర చాహల్ పని.
అయితే, ఇప్పుడు ఆ చిన్న పనే తన లో ఉన్న సిగ్గు ను నెమ్మది గా తగ్గిస్తోంది అంటున్నాడు ఈ యువ ఆటగాడు. ఈ మధ్యే అంటే జనవరి లో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లో భాగం గా భారత్ మరియు ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు తలపడ్డాయన్న విషయం మన అందరికి తెలిసిందే.
అయితే, ఆస్ట్రేలియా గడ్డ పై జరిగిన ఒక ODI లో ఏకం గా ఆరు వికెట్లను పడగొట్టడం ఇప్పటి వరకు ఏ బౌలర్ సాధించలేదు ఒక్క యుజ్వేంద్ర చాహల్ తప్ప. ఆ విషయమై స్పందించిన చాహల్ చాలా విచిత్రం గా అతనికి ఆ మ్యాచ్ లో కొద్దిగా నెర్వస్ గా అంటే భయం గా అనిపించినట్లు మీడియా కు వివరించాడు. ఆస్ట్రేలియా తో మ్యాచ్ కావడమే ఇందుకు కారణం.
“ఆ రోజు నా యొక్క మొదటి ఓవర్ ముగియగానే, ఇక ఇది నా రోజు అని అనిపించింది,” అన్నాడు చాహల్ నవ్వుతూ. నాకెప్పుడైనా భయం గా అనిపించినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న గొప్ప గొప్ప క్రీడా కారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉంటాను.
“విరాట్ కోహ్లీ భయ్యా, మహి భయ్యా, రోహిత్ శర్మ భయ్యా, శిఖర్ ధావన్ భయ్యా నాకెప్పుడూ సహాయం గా నిలుస్తారు. విరాట్ కోహ్లీ భయ్యా నా పక్కన లేకపోతె, రోహిత్ భయ్యా ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడుగుతూ సలహాలు తీసుకుంటాను. ఇక నేను ఇంకా మహి భయ్యా అయితే చాలా సార్లు ఇద్దరం కలిసి PUBG ఆడాం. మన జట్టు లో కనీసం ఏడు, ఎనిమిది మంది PUBG ని కనీసం రెండు గంటల పాటు ఆడుతారు. మేమందరం కలిసి డిన్నర్ చేయడానికి కూడా వెళతాం. మహి అన్న కింద ఆడటం చాలా గొప్ప విషయం. తను నా మొదటి కెప్టెన్. బౌలింగ్ గురించి కుల్దీప్ ఇంకా నేను మహి అన్న దగ్గర సలహాలు తీసుకుంటాం, ” అని యుజ్వేంద్ర చాహల్ టీం తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు.
Be the first to comment on "యుజ్వేంద్ర చాహల్: మహి అన్న ఇంకా నేను కలిసి పబ్జి (PUBG) ఆడతాం"