ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న పాకిస్తాన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ బాబర్ అజాం తనను ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ తో పోల్చవద్దని మీడియా ని కోరాడు. ఇది వరకు చాలా సార్లు బాబర్ అజాం అభిమానులు ఇంకా క్రికెట్ విశ్లేషకులు కూడా అతన్ని మన విరాట్ కోహ్లీ తో పోల్చిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే.
అయితే, ఇవాళ బాబర్ అజాం ఈ విషయమై మాట్లాడుతూ, తాను విరాట్ కోహ్లీ కి ఏమాత్రం దగ్గరగా లేనని మీడియా వర్గాల తో వ్యాఖ్యానించి తన ఫ్యాన్స్ ని కొద్దిగా నిరాశ పరిచాడనే మనం చెప్పుకోవాలి. “ఇప్పటి వరకు నన్ను చాలా మంది, నా అభిమానులు ఇంకా విమర్శకులు ఎన్నో సార్లు ఇండియన్ సూపర్ స్టార్ అయినటువంటి విరాట్ కోహ్లీ తో పోల్చారు. ఆయన ఆ స్థానానికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. నేను విరాట్ కి చాలా దూరం లో ఉన్న. అతను ప్రస్తుతం ఉన్న స్థానానికి చేరుకోవడానికి నేను ఇంకా ఎంతో సాధన చేయాల్సి ఉంది ఎన్నో సాధించాల్సిన అవసరం ఉంది,” అని బాబర్ అజాం తనను విరాట్ కోహ్లీ తో పోల్చవద్దు అంటూ తన ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహా లోనే పాకిస్తాన్ దేశం లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ (కేకే) జట్టు తరపున ప్రస్తుతం ఆడుతున్న బాబర్ అజాం ఇవాళ జరిగిన ఒక PSL ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేసాడు. “నేను నా యొక్క క్రికెట్ కెరీర్ ను ఇప్పుడే మొదలు పెట్టాను, ఇప్పటికే విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎంతో సాధించాడు. నేను ఆ స్టేజ్ కి ఇంకా చేరుకోలేదు,” అని బాబర్ అజాం మీడియా కు వివరించాడు.
బాబర్ అజాం యొక్క ఆట విషయానికి వస్తే, ఈ మధ్యే సౌత్ ఆఫ్రికా తో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తలపడిన ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్ నే మనం మంచి ఉదాహరణ గా భావించవచ్చు. ఆ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన అతి కొద్ది మంది బ్యాట్స్ మన్ లో బాబర్ అజాం ఒకడిగా నిలిచి మంచి పెర్ఫార్మెర్ గా నిలిచాడు.
ఐదు మ్యాచ్ లలో 216 పరుగులు చేసిన బాబర్ అజాం తన సత్తా చాటాడు. ఈ విధం గా మంచి ఆట తీరును ప్రదర్శించే ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టు లో చాలా తక్కువ మంది అనే మనం చెప్పుకోవాలి. అందుకనే, గ్రౌండ్ లో దూకుడుగా వ్యవహరించి మంచి స్కోర్ లను తరుచుగా నమోదు చేస్తున్న బాబర్ అజాం ను మన స్టార్ బ్యాట్స్ మన్ ఇంకా ప్రపంచం లోనే అత్యంత అద్భుతమైన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ తో బాబర్ ను పాకిస్తాన్ లోని క్రికెట్ అభిమానులు పోలుస్తున్నారు.
ఈ మధ్యే బాబర్ అజాం యొక్క ఆట తీరును మెచ్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్, అతను ప్రపంచ క్రికెట్ లో మంచి పేరు ప్రతిష్ఠలను తెచ్చుకుంటాడని, ఇంకా మరో కోహ్లీ అవుతాడనడం లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకొచ్చాడు.
1994 వ సంవత్సరం అక్టోబర్ 15 న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించిన బాబర్ అజాం 2015 లో మే 31 న జింబాబ్వే క్రికెట్ జట్టు తో పాకిస్తాన్ తలపడ్డ వన్ డే ఇంటర్నేషనల్ లో పాల్గొని తన యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ను ఆరంభించాడు. 2016 వ సంవత్సరం అక్టోబర్ 13 న వెస్ట్ ఇండీస్ జట్టు తో పాకిస్తాన్ పోటీ పడ్డ టెస్ట్ లో పాలు పంచుకుని బాబర్ అజాం టెస్ట్ క్రికెట్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
Be the first to comment on "విరాట్ కోహ్లీ తో తనను పోల్చవద్దు అంటున్న బాబర్ అజాం"