రికీ పాంటింగ్ IPL లో పాలు పంచుకోవడం పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న షేన్ వార్న్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్, ఆ స్థానం లో కొనసాగుతుండటం పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మరియు సీనియర్ ఆటగాడైన షేన్ వార్న్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసాడు. రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా దేశ క్రికెట్ జట్టు కు ఇది వరకు కొన్నేళ్లు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే.

అయితే, ఇక్కడ మనం తెలుసుకోవలసిన మరో విశేషం ఏంటంటే, రికీ పాంటింగ్ తన సొంత దేశమైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క కోచింగ్ స్టాఫ్ లో ఒక సభ్యుడు గా ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వారు నిర్వహించే వరల్డ్ కప్ 2019 ఈ సంవత్సరం మే నెలలో మొదలవనుంది.

అయితే, ఇప్పుడు వరల్డ్ కప్ కి ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత రికీ పాంటింగ్ పై చాలానే ఉంది అనేదే షేన్ వార్న్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం గా మనం భావించవచ్చు. ప్రస్తుతం షేన్ వార్న్ కూడా మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాలు పంచుకుంటున్నాడు.

మనోజ్ బాదాలే ఓనర్ గా ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు కి అతను బ్రాండ్ అంబాసిడర్ గా ఇంకా హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నలభై తొమ్మిది సంవత్సరాల వయసున్న షేన్ వార్న్, ప్రపంచం లోనే అత్యుత్తమ బౌలర్ గా ఖ్యాతి గడించడమే కాకుండా, ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ టీం కి కొద్ది సంవత్సరాల పాటు వన్ డే ఇంటర్నేషనల్ (ODI) ఫార్మాట్ కి కెప్టెన్ గా ఆ జట్టు ని ముందుండి నడిపించాడు.

ఇప్పుడు అందరిననీ, క్రికెట్ అభిమానులకి ఇంకా క్రికెట్ విశ్లేషకులందరికి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా కు చెందిన ఒక మాజీ కెప్టెన్ అదే దేశానికి చెందిన మరో మాజీ కెప్టెన్ ను విమర్శించడమే. అయితే, షేన్ వార్న్ ఇలా రికీ పాంటింగ్ పై విమర్శ చేయడం లో పెద్ద ఆశ్చర్యం గాని మతలబు గాని ఏమి లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారట.

ఎందుకంటే, వార్న్ చెప్పిన మాటలను గనక పరిశీలించినట్లయితే, పాంటింగ్ తన యొక్క సొంత దేశ విజయం కోసం పాటు పడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అక్కడ వారి జట్టు యొక్క ఆటగాళ్లకు తన అనుభవాన్ని జోడించి సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంటుంది అని అదే దేశానికి చెందిన మరో సీనియర్ ఆటగాడు అభిప్రాయ పడటం లో ఎటువంటి తప్పు లేదనే భావన విశ్లేషకులకు కలుగుతోందని మనం చెప్పుకోవాలి.

ఈ విధం గా తన అభిప్రాయాన్ని మీడియా కు వ్యక్తం చేసిన షేన్ వార్న్ ఒక్కసారిగా ట్రెండింగ్ టాపిక్ గా మారాడు. అయితే, తన ఈ భావనను బలపరుస్తూ, షేన్ వార్న్ 2015 వ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయమై జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసాడు.

ప్రస్తుత ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం కోచ్ అయినటువంటి రవి శాస్త్రి అప్పట్లో అంటే 2015 వ సంవత్సరం లో టీం కి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించాడు. అదే సమయం లో IPL గవర్నింగ్ కౌన్సిల్ లో కూడా ఒక సభ్యునిగా ఉన్నాడు. అయితే, బోర్డు ఫర్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధికారులు ఈ విషయమై చాలా ఆలోచించి రవి శాస్త్రి ని IPL గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఇదే విషయాన్నీ షేన్ వార్న్ ముంబై మిర్రర్ పత్రికా ప్రతినిధులకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావించాడు.

ఇటీవల హార్దిక్ పాండ్య ఇంకా రాహుల్ ఒక టీవీ షో లో చేసిన కామెంట్ లు ఇంకా ఆ తరువాత జరిగిన పరిణామాల పై స్పందించిన షేన్ వార్న్, ఆటగాళ్లకు వారి భావనలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండటం చాలా అవసరమని చెప్పుకొచ్చాడు.

Be the first to comment on "రికీ పాంటింగ్ IPL లో పాలు పంచుకోవడం పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న షేన్ వార్న్"

Leave a comment

Your email address will not be published.


*