తమ సొంత గ్రౌండ్ లలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది సౌత్ ఆఫ్రికా. చాలా దూకుడుగా వ్యవహరించి ఇంటి పోరులో ఎలాగైనా నెగ్గుతూ వస్తోంది సౌత్ ఆఫ్రికా టీం. ఇందుకు మంచి ఉదాహరణ ఏంటంటే, వారు ఈ మధ్యనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు తో తలపడిన సంగతి మన అందరికి విదితమే.
అయితే, అసలు విషయం ఏంటంటే, ఆ మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ని సౌత్ ఆఫ్రికా 3 – 0 లీడ్ తో ముగించడమే. అంటే, వారి ఆతిధ్య జట్టు అయినటువంటి పాకిస్తాన్ కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా తన సత్తా చాటలేక పోయిందన్నమాట.
ఇంకా లోతుగా పరిశీలిస్తే, సౌత్ ఆఫ్రికా జట్టు పాకిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసి గెలవడం ఒక ఎత్తయితే మరో అద్భుతమైన విషయం ఏంటంటే, అది ఆ జట్టు కి ఏడో వరుస టెస్ట్ సిరీస్ విజయం (వారి దేశం లోనే జరిగిన మ్యాచ్ లు మాత్రమే). 2017 వ సంవత్సరం లో జరిగిన ఒక టెస్ట్ సిరీస్ లో భాగం గా అదే దేశం లో శ్రీలంక తో సౌత్ ఆఫ్రికా తలపడినపుడు కూడా ఇదే విధం గా పాకిస్తాన్ కు పట్టిన గతే శ్రీలంక జట్టు కూడా ఎదుర్కొంది. అంటే మూడు మ్యాచ్ లు ఉంటే, అన్ని మ్యాచ్ లను కూడా సౌత్ ఆఫ్రికా నే కైవసం చేసుకుంది అన్నమాట.
ఇప్పుడా గోర పరాజయాన్ని శ్రీలంక క్రికెట్ అభిమానులు మరువక ముందే, ఇప్పుడు 2019 వ సంవత్సరం లో మళ్లీ ఈ ఇరు జట్లు పోటీ పడనున్నాయి. ఈ బుధవారం అంటే భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 13 వ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటా ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా దేశం లోని డర్బన్ సిటీ కు చెందిన కింగ్స్మెడ్ క్రికెట్ గ్రౌండ్ ఈ ఉత్కంఠ భరితమైన పోరు కు వేదిక కానుండడం విశేషం.
ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే, సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు యొక్క ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెడుతుందనే మనం చెప్పుకోవాలి. ఆ జట్టు బ్యాట్స్ మన్ యొక్క మంచి ప్రతిభా పాటవాలు, ఇంకా వారి యొక్క దూకుడు స్వభావం సౌత్ ఆఫ్రికా ని విజయ తీరాల వైపు నడిపిస్తున్నాయి అనటం లో ఏమాత్రం సందేహం లేదు.
అయితే, సౌత్ ఆఫ్రికా జట్టు ఇంటి పోరులో ప్రత్యర్థి జట్లను ఓటమి పాలు చేస్తున్నప్పటికీ కూడా అవతలి దేశాలలో జరిగిన మ్యాచ్ లలో కొద్దిగా తడబడుతున్నట్లు కనిపిస్తుంటుంది. దీనికి, వారు శ్రీలంక టూర్ లో భాగం గా పోయిన సంవత్సరం జులై లో శ్రీలంక తో జరిగిన సిరీస్ లో 2 – 0 తేడాతో గోర పరాజయాన్ని మూట కట్టుకోవడమే మంచి ఉదాహరణగా మనం భావించ వచ్చు. అయితే, శ్రీలంక లో ఉన్న పిచ్ తో పోల్చితే, సౌత్ ఆఫ్రికా పిచ్ కొంచెం స్లో అని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయపడిన సంగతి మనకి విదితమే. ఆ పిచ్ ని తమకి అనుకూలం గా మార్చుకోవడం లో దిట్ట గా మారారు సౌత్ ఆఫ్రికా కు చెందిన బౌలర్ లు. అందుకనే, సౌత్ ఆఫ్రికా జట్టు వారి దేశం లోనే జరిగిన ఏడు వరుస టెస్ట్ సిరీస్ విజయాలను నమోదు చేసింది.
ఇప్పుడు ఈ విషయాలు శ్రీలంక జట్టు ఆటగాళ్లకు మింగుడు పడటం లేదనే మనం చెప్పుకోవాలి మరి. ఎలాగైనా వారు 2017 వ సంవత్సరం లో ఆ దేశం లో ఎదుర్కున్న గోర పరాజయాన్ని మరిపించేలా ఈ సంవత్సరం మంచి ప్రదర్శన కనబరిచి సౌత్ ఆఫ్రికా కి చుక్కలు చూపించి ఈ సిరీస్ ని కైవసం చేసుకోవాలని చూస్తోంది శ్రీలంక క్రికెట్ జట్టు.
Be the first to comment on "శ్రీలంక ని చిత్తు గా ఓడించాలని భావిస్తున్న సౌత్ ఆఫ్రికా"