ఇండియా vs న్యూజిలాండ్: మూడవ టీ20 మ్యాచ్ హైలైట్స్

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన భారత క్రికెట్ జట్టు మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతా లో ఎదురు చూసిన తరుణం లో పెద్ద బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు మూడు సిరీస్ లు అంటే రెండు వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లు ఇంకా ఒక టీ20 సిరీస్ లలో భారత జట్టు పాల్గొనగా రెండింటిలో  విజయకేతనం ఎగురవేసింది.

మొత్తానికి 2019 వ సంవత్సరం మన క్రికెట్ టీం కు బాగానే కలిసొస్తోందనే మనం చెప్పుకోవాలి మరి. ఎందుకంటే జనవరి నెల మొదటి వారం లోనే ఆస్ట్రేలియా దేశం తో జరిగిన ODI సిరీస్ లో విరాట్ కోహ్లీ సేన ఒక చారిత్రాత్మకమైన గెలుపును సొంతం చేసుకుని ముందుకు సాగింది. ఆ తరువాత, న్యూజిలాండ్ దేశ క్రికెట్ జట్టు తో ఐదు మ్యాచ్ ల ODI సిరీస్ లోనూ పాల్గొన్న సంగతి మనకి తెలిసిందే.

అందులోనూ, మరింత దూకుడుగా ఆట తీరును ప్రదర్శించిన మన ఆటగాళ్లు న్యూజిలాండ్ కి చుక్కలు చూపించి ఏకం గా 4 – 1 లీడ్ తో సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఇక మూడవది, క్రికెట్ లో షార్ట్ ఫార్మాట్ మ్యాచ్ అయిన టీ20 సిరీస్.

న్యూజిలాండ్ తోనే జరిగిన ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ లో కూడా ఒక గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ, మన భారత క్రికెట్ జట్టు పై  2 – 1 లీడ్ తో ప్రత్యర్థి జట్టు సిరీస్ ను తన ఖాతా లో వేసుకుంది. నిన్న జరిగిన ఈ సిరీస్ లోని చివరిదైన మూడవ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన న్యూజిలాండ్, భారత జట్టు పై నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని తమ సత్తా చాటారు.

అయితే, ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లో మొత్తం గా చతికల పడిపోయి చెత్త ప్రదర్శన చేసి విమర్శకులు ఇంకా వారి దేశ క్రికెట్ అభిమానుల నుంచి తిట్లు తిన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు, ఎలాగైనా ఈ సిరీస్ లో నెగ్గి భారత్ ను ఓడించి తమ సత్తా చాటాలనే తాపత్రయం తో చాలా గట్టి ప్రయత్నమే చేసారని చెప్పుకోవాలి.

సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఏకం గా డెబ్భై పరుగుల తేడాతో మంచి విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ జట్టు, రెండవ మ్యాచ్ లో అంత బాగా రాణించలేక పోయింది. ఈ దశలో, రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఉండగా, అందరి కన్ను ఆ మూడవ మ్యాచ్ పై పడిందనే చెప్పుకోవాలి.

ఈ మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనిమిది పరుగులు (208/6 – 20 ఓవర్లు) చేయగా  న్యూజిలాండ్ జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల పన్నెండు (212/4) పరుగులను సాధించి సిరీస్ ను తన వశం చేసుకుంది. మొదటగా బౌలింగ్ ని ఎంచుకున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ లో మంచి ప్రదర్శన కనబరిచి, మన బ్యాట్స్ మన్ ను స్వల్ప స్కోర్ చేసేలా చాలా బాగా కట్టడి చేశారనే మనం చెప్పుకోవాలి మరి.

మన జట్టు తరపున ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ ఇంకా రోహిత్ శర్మ లు ఒక పెద్ద పార్టర్న్ షిప్ స్కోర్ ను నమోదు చేయలేకపోవడం కూడా మన ఓటమిలో ఒక కారణం గా చెప్పుకోవచ్చు. అయితే, రోహిత్ శర్మ కొంచెం బాగానే ఆడి 38 పరుగులను సాధించగా, ధావన్ మాత్రం ఎప్పటి లాగానే చతికల పడిపోయి కేవలం ఐదు పరుగులను మాత్రమే నమోదు చేసాడు. అయితే, ఈ మ్యాచ్ లో 43 పరుగులను సాధించిన విజయ్ శంకర్ మాత్రం మంచి ప్రదర్శన చేసాడనే మనం చెప్పుకోవాలి.

Be the first to comment on "ఇండియా vs న్యూజిలాండ్: మూడవ టీ20 మ్యాచ్ హైలైట్స్"

Leave a comment

Your email address will not be published.


*