ఇండియా vs న్యూజిలాండ్ ODI సిరీస్: మెరిసిన అంబటి రాయుడు, మహమ్మద్ షమీ

మన భారత క్రికెట్ జట్టు ఈ సంవత్సరం మొదలు లోనే విమర్శకుల నోర్లకు తాళం వేసిందనే చెప్పుకోవాలి. జనవరి మొదటి వారం లోనే ముగిసిన మన టీం యొక్క ఆస్ట్రేలియా టూర్, మంచి సంకేతాలను అందించింది. ఆస్ట్రేలియా లో వారి గడ్డ పైనే ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ను గెలుచుకుని ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని తమ ఖాతా లో వేసుకున్నారు మన కుర్రాళ్లు.

అయితే, ఆ తరువాత జరిగిన ఇండియా vs న్యూజిలాండ్ ODI సిరీస్ లోనూ మన వాళ్లు తమకు ప్రపంచ వ్యాప్తం గా తిరుగులేదనే విధం గా సత్తా చాటి ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లోనూ విజయ కేతనం ఎగుర వేసి తమ యొక్క ప్రతిభ ను చాటుకుని మున్ముందు రాబోయే టీ20 సిరీస్ ఇంకా అతి ముఖ్యం గా చెప్పాలంటే ఈ సంవత్సరం లోనే జరగబోయే వరల్డ్ కప్ కోసం చాలా బాగా కృషి చేస్తున్నారనే మనం చెప్పుకోవాలి.

ఇక మన వాళ్లు సాధించిన ప్రస్తుత విజయం గురించి గనక మనం మాట్లాడుకున్నట్లైతే, న్యూజిలాండ్ తో తలపడిన మన జట్టు ఏకం గా ఐదు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లను గెలిచి అంటే 4 -1 లీడ్ ను కనబరిచి ఆ దేశ గడ్డ పైనే ప్రత్యర్థిని చిత్తు చిత్తు గా ఓడించిందనే చెప్పాలి మరి.

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆ ఒక్క మ్యాచ్ ను కూడా కైవసం చేసుకుని ఉండకపోతే మన వాళ్లు క్లీన్ స్వీప్ చేసేవారన్నమాట. అయితే, భారత జట్టు ఓడిపోయిన ఆ ఒక్క మ్యాచ్ అంటే సిరీస్ లో జరిగిన నాలుగవ మ్యాచ్ మన బ్యాట్స్ మన్ యొక్క బలహీనతలను గట్టిగా ఎత్తి చుపిందనే చెప్పుకోవాలి.

ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లు తమ విశ్వ రూపం చూపించగా, మన వాళ్లు వారిని తాళలేక చేతులెత్తేసి కేవలం 93 పరుగుల అతి స్వల్ప టార్గెట్ ను ప్రత్యర్థి ముందుంచగా, వారు దానిని కేవలం 14.4 ఓవర్ల లోనే ఛేదించి తమ పరువు నిలబెట్టకున్నారు. అయినప్పటికీ, ఆ మ్యాచ్ కు మన జట్టు కెప్టెన్ గా నేతృత్వం వహించిన రోహిత్ శర్మ, తమకదో మంచి గుణపాఠమని చెప్పుకొచ్చాడు.

ఏది ఎలా ఉన్నా, మొత్తానికి ఈ ఏడాది మొదలవగానే రెండు సిరీస్ లలో తమ సత్తా చాటి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ జట్లను ఓడించి మన వాళ్లు, వరల్డ్ కప్ కి సన్నద్ధం గా లేరు అని విమర్శించిన విమర్శకుల నోర్లకు తాళం వేశారనే చెప్పుకోవాలి మరి. ఇక ప్రస్తుత సిరీస్ విషయానికొస్తే, న్యూజిలాండ్ జట్టు ను ఓడించడం లో కీలకం గా వ్యవహరించి అందరి మన్ననలను అందుకుంటున్నారు అంబటి రాయుడు ఇంకా మహమ్మద్ షమీ.

మొన్న జరిగిన ఐదవ వన్ డే ఇంటర్నేషనల్ లో కేవలం 18 పరుగులను మాత్రమే చేసి నాలుగు వికెట్లను కోల్పోయిన భారత జట్టు ను అన్నీ తానై 113 బంతుల్లో 90 పరుగులను చేసి విజయం వైపు నడిపించాడు అంబటి రాయుడు. రోహిత్ శర్మ లాంటి అనుభవం కలిగిన క్రీడా కారులు కూడా చేతులెత్తేసిన సమయం లో అంబటి రాయుడు టీం గెలుపులో కీలక పాత్ర ను పోషించగలిగాడు. 

ఇక మన బౌలర్ల విషయానికి వస్తే, మహమ్మద్ షమీ ఈ సిరీస్ లో తన మొత్తం కెరీర్ లోనే ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పక తప్పదు. నాలుగు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లను (సగటున 15.33) పడగొట్టి జట్టు గెలుపులో కీలకం గా వ్యవహరించాడు. షమీ యొక్క ఎకనామిక్ రేట్ 4.75 కాగా అతడిని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

మన భారత ఆటగాళ్లు, ఇక తరువాత న్యూజిలాండ్ తో తలపడే టీ20 సిరీస్ లో ఏ విధం గా రాణిస్తారో చూడాలి మరి.

Be the first to comment on "ఇండియా vs న్యూజిలాండ్ ODI సిరీస్: మెరిసిన అంబటి రాయుడు, మహమ్మద్ షమీ"

Leave a comment

Your email address will not be published.


*