న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్ ను మన భారత జట్టు 4 – 1 తేడాతో తన కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం నాడు న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ రీజినల్ క్రికెట్ స్టేడియం లో జరిగినటువంటి చివరి ODI (ఐదవది) లో రోహిత్ శర్మ సారథ్యం లోని మన భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పై ముప్పై ఐదు (35 runs) పరుగుల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది.
విరాట్ కోహ్లీ మ్యాచ్ ల మీద మ్యాచ్ లు ఒకదాని తరువాత మరొకటి రావడం తో, ఇంకా వాటికి కెప్టెన్ గా బాధ్యత వహించాల్సిన అవసరం ఉండటం చేత కొంత ఒత్తిడి కి గురైన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ మీద ఆ భారాన్ని తగ్గించడానికి బోర్డు ఫర్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) విరాట్ కోహ్లీ ని న్యూజిలాండ్ తో జరిగిన ఈ ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లోని మూడు మ్యాచ్ ల నుంచి తప్పిస్తూ, విరాట్ కి బదులుగా రోహిత్ శర్మ కి కెప్టెన్ గా టీం కి నేతృత్వం వహించే బాధ్యతలను అప్ప జెప్పిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే.
అయితే, అప్పటికే ఆస్ట్రేలియా తో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ కి ఇంకా న్యూజిలాండ్ తో జరిగిన ఈ సిరీస్ లోని రెండు మ్యాచ్ లకు అంటే మొత్తం ఏడు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ తన బాధ్యతలను సక్రమం గా నిర్వహించాడనే చెప్పుకోవాలి.
ఇప్పుడు విరాట్ తన భార్య అయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తో సరదాగా గడుపుతున్నాడు. ఇక మన భారత జట్టు యొక్క ప్రస్తుత కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ విషయానికి వస్తే, అతడు సారథ్యం వహించిన నాలుగవ ODI లో మన టీం న్యూజిలాండ్ పై ఒక గోర పరాజయాన్ని నమోదు చేసింది.
తరువాత, రోహిత్ శర్మ కి విమర్శకుల నుంచి ఇంకా అభిమానుల నుంచి కూడా గట్టి దెబ్బే ఎదురైందని మనం చెప్పుకోవాలి. ఎలాగైనా విమర్శకుల నోర్లకు తాళాలు వేయాలి అనే పట్టుదలను తెచ్చుకున్న రోహిత్ శర్మ నిన్న జరిగిన ఐదవ ODI లో మంచి విజయం సాధించేలా చాలానే కృషి చేసాడు. యాభై ఓవర్లలో 252 పరుగులను చేసిన మన బ్యాట్స్ మన్ న్యూజిలాండ్ బౌలర్లకు కొంత ఇబ్బంది కలిగించారనే చెప్పుకోవాలి.
ఎందుకంటే, అంతకంటే ముందు జరిగిన నాలుగవ ODI లో న్యూజిలాండ్ బౌలర్ల ఆట తీరుకు తాళలేక మన వాళ్లు చేతులెత్తేసిన సంగతి మనం మర్చిపోయే విషయం కానే కాదు. కేవలం తొంబై రెండు పరుగులకే పరిమితం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. అయితే, ఆదివారం జరిగిన ఐదవ మ్యాచ్ లో మన బౌలర్లు న్యూజిలాండ్ కి చుక్కలు చూపించారని మనం చెప్పుకోవాలి మరి.
మన బ్యాట్స్ మన్ వారికి 253 పరుగులను టార్గెట్ గా సెట్ చేయగా, న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ మొత్తం కేవలం 217 పరుగులను మాత్రమే సాధించి కుప్పకూలిపోయారు. మన బౌలర్లు గొప్ప ఆట తీరు ను, అద్భుతమైన ఆట శైలి ని ప్రదర్శించి ప్రత్యర్థి యొక్క అన్ని వికెట్లను పడగొట్టగలిగారు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, నాలుగవ ODI లో భారత్ తరుపున టాప్ స్కోరర్ గా నిలిచినటువంటి మన ఆల్ రౌండర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్ అనంతరం జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు. రోహిత్ శర్మ ని సరదాగా ఇంటర్వ్యూ చేసిన చాహల్, న్యూజిలాండ్ తో తరువాత జరుగబోయే టీ20 సిరీస్ లో విరాట్ కోహ్లీ యొక్క మూడవ స్థానాన్ని భర్తీ చేయగలవా అని రోహిత్ ని అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు, రోహిత్ శర్మ స్పందిస్తూ, జట్టు లోని ఎవరు కూడా వారికి లభించిన నెంబర్ గురించి ఆలోచించరు. కానీ చాహల్ యొక్క స్థానాన్ని (నెంబర్) ను పైకి తీసుకురావచ్చొ లేదో తాను నిర్వహణ అధికారులను అడిగి తెలుసుకుంటానని అతనికి తెలిపాడు. చాహల్ టీవీ గా ఈ వీడియో కి పేరు పెట్టిన బీసీసీఐ, ట్విట్టర్ లోని అభిమానులకు చేరవేసింది.
Be the first to comment on "ఇండియా vs న్యూజిలాండ్: విరాట్ యొక్క మూడవ స్థానం లో ఆడమని రోహిత్ ని కోరిన చాహల్"