న్యూజిలాండ్ దేశం లో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్ లో మొన్నటి దాకా వరుస విజయాలను అందుకున్న మన భారత క్రికెట్ జట్టు , ఇవాళ న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడి ఒక గోర పరాజయాన్ని తన ఖాతా లో వేసుకుంది. ఏకం గా మూడు వరుస మ్యాచ్ లలో విజయాన్ని సొంతం చేసుకున్న మన టీం నేడు న్యూజిలాండ్ లోని హామిల్టన్ క్రికెట్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి ముందు తేలిపోయింది.
అయినప్పటికీ, ఈ ODI సిరీస్ ఇప్పటికే 3 – 1 తేడాతో మన గుప్పిట్లోకి వచ్చినట్లైంది. అయితే, మనకు ఆతిధ్యం ఇస్తున్నటువంటి న్యూజిలాండ్ జట్టు వారి హోమ్ గ్రౌండ్ లలోనే భారత్ పై తమ సత్తా చాటక వారి యొక్క అభిమానుల ముందు చులకన కావడానికి ఏమాత్రం సిద్ధం గా లేమని తెలియజేయడానికి నేటి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి కొంచెం పరువును కాపాడుకున్నారని మనకు స్పష్టం గా అర్ధం అవుతోంది.
ఇక నేటి నాలుగవ ODI మ్యాచ్ వివరాలను గనక పరిశీలిస్తే, ముందుగా బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మన భారత బ్యాట్స్ మన్ ను ఒక ఆట ఆడుకున్నారనే చెప్పుకోవాలి మరి. ఎందుకంటే, మన వాళ్లు ప్రత్యర్థి యొక్క దీటైన బౌలింగ్ కు తాళలేక కేవలం ముప్పై ఓవర్ లకే చేతులెత్తేశారు. 30.5 ఓవర్లలో అన్ని వికెట్ లను కోల్పోయిన మన భారత జట్టు 92 పరుగులను మాత్రమే సాధించి, 93 పరుగుల అతి స్వల్పమైన, 2010 తరువాత ఎప్పుడు నమోదు కాని ఒక అత్యల్ప టార్గెట్ ను ప్రత్యర్థులకు నిర్దేశించారు.
అతి తక్కువదైన ఈ 93 పరుగుల టార్గెట్ ను మన ప్రత్యర్థి అయిన న్యూజిలాండ్ జట్టు కేవలం 14.4 ఓవర్లలో సాధించి ఈ సిరీస్ లో ఒక అద్భుతమైన విజయాన్ని తమ సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్ట గలిగిన మన బౌలర్లు న్యూజిలాండ్ కు ఏకం గా ఎనిమిది వికెట్ల విజయాన్ని కట్టబెట్టారు.
ఇరవై ఐదు (25 Balls) బంతుల్లో ముప్పై ఏడు (37 Runs) పరుగులను తన ఖాతా లో వేసుకున్న రోస్ టేలర్ న్యూజిలాండ్ బాటింగ్ విభాగం లో కీలకం గా మారడమే గాక ఆ జట్టు గెలుపులో మంచి పాత్ర పోషించాడు. ఇక మన ప్రత్యర్థి జట్టు యొక్క అద్భుతమైన బౌలింగ్ విభాగం గురించి మాట్లాడాలంటే ముందుగా ట్రెంట్ బౌల్ట్ గురించి మనం చెప్పుకోవాల్సిందే.
ఇవాళ జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు కు చుక్కలు చూపించి, మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను సొంతం చేసుకున్నాడు ట్రెంట్ బౌల్ట్. ఏకం గా ఐదు వికెట్లను పడగొట్టి భారత బ్యాట్స్ మన్ ను ముప్పు తిప్పలు పెట్టి అతని టీం యొక్క మొదటి విజయం లో అద్భుతమైన పాత్రను పోషించి తన సత్తా చాటాడు బౌల్ట్. అలాగే, మన బ్యాట్స్ మన్ యొక్క బలహీనతలు కూడా ఈ మ్యాచ్ వేదికగా బయటపడేలా ట్రెంట్ బౌల్ట్ వ్యవహరించాడు.
ఈ విషయాన్ని మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ నే స్వయం గా మీడియా కు వెల్లడించాడు కూడా. “చాలా రోజుల తరువాత మా జట్టు ఇచ్చిన అతి చెత్త ప్రదర్శన ఇది. ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు. కానీ మనం న్యూజిలాండ్ యొక్క బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారు ఈ విజయాన్ని సొంతం చేసుకోవడానికి పడ్డ కృషి చెప్పుకోదగిన విషయం. ఇలాంటి సమయాల్లో నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి,” అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా హిందూస్తాన్ టైమ్స్ వారు వెల్లడించారు.
న్యూజిలాండ్ కెప్టెన్ అయిన కేన్ విలియంసన్ ఈ అద్భుత విజయం పై స్పందిస్తూ, తన జట్టు యొక్క బౌలర్లు చాలా గొప్ప ఆట తీరును ప్రదర్శించారని వ్యాఖ్యానించాడు.
Be the first to comment on "ఇండియా vs న్యూజిలాండ్ ODI సిరీస్: గోర పరాజయం పాలైన భారత జట్టు"