రాబోయే సంవత్సరం జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 18, 2020 నుంచి నవంబర్ 15వరకు ఈ వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16దేశాలు పాల్గొంటున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహాకాల్లో భాగంగా అన్ని దేశాలు టీ20 సిరిస్‌లను ఆడుతున్నాయి. ఆదివారంతో ముగిసిన ఈ టీ20 సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వచ్చే సంవత్సరం జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడబోయే టీ20 సిరిస్‌లకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. షెడ్యూల్ లోని విధంగా టీమిండియా ఈ సంవత్సరం డిసెంబర్‌లో వెస్టిండిస్‌తో సొంతగడ్డపై మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత జనవరిలో శ్రీలంకతో సొంతగడ్డపై మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. అదే జనవరి చివర్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరిస్ ఆడనుంది.
అనంతరం శ్రీలంకలో లంకపై మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ పర్యటన జూన్ 2020లో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌లో సుమారు ఐదు నుంచి ఏడు టీ20ల్లో పాల్గొంటుంది. ఇక, టీ20 వరల్డ్‌కప్‌కు సరిగ్గా నెలరోజుల ముందు అంటే అక్టోబర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో చెరో మూడు టీ20ల్లో తలపడనుంది. కాగా, ఇటీవలే క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ముగియడంతో టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ని ఐసీసీ విడుదల చేసింది. టోర్నీలో తొలి మ్యాచ్ శ్రీలంక, ఐర్లాండ్ మధ్య అక్టోబర్ 18న జరుగుతుంది. ఇక, భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్ జట్టుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ నిర్వహిస్తారు. కాగా, సూపర్-12 దశలో టీమిండియా ఐదు మ్యాచుల్లో తలపడనుంది.
1. భారత్ vs దక్షిణాఫ్రికా: అక్టోబర్
24, శనివారం సాయంత్రం 4:30
2. భారత్ vs అర్హత జట్టు: అక్టోబర్ 29, గురువారం
మధ్యాహ్నం 1:30
3. భారత్ vs ఇంగ్లాండ్: నవంబర్ 1, ఆదివారం
మధ్యాహ్నం 1:30
4. భారత్ vs అర్హత జట్టు: నవంబర్ 5, గురువారం
మధ్యాహ్నం 2:00
5.భారత్ vs అఫ్గానిస్థాన్: నవంబర్ 8, ఆదివారం మధ్యాహ్నం 1:30
Be the first to comment on "వచ్చే సంత్సరంలో టీమిండియా జట్టు ఆడే మ్యాచ్ వివరాలు"