భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఒక కేసులో ఇర్రుకున్నాడు. తనను, తన కొడుకును తిట్టడమే కాకుండా కొట్టాడు దీపక్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆ టైములో ప్రవీణ్ కుమార్ మద్యం తాగి మత్తులో తూలుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సుమారు మధ్యాహ్నం 3 గంటలకు తాను కొడుకు స్కూల్ బస్సు కోసం ఎదురు చూస్తుండగా ప్రవీణ్ కారుకు స్కూల్ బస్సు అడ్డు రావడంతో అతడు బస్సు డ్రైవర్‌తో గొడవకి దిగి తిట్టడం మొదలుపెట్టాడు. ఇక తాను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా. ప్రవీణ్ తనపై దాడి చేశాడని దీపక్ శర్మ తెలిపారు. ఈ గొడవలో తన చెయ్యికి ఫ్రాక్చర్ కావడమే కాకుండా తన ఏడేళ్ల కొడుకును కూడా తోసేయడంతో అతనికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు. అయితే ప్రవీణ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని దీపక్ వాపోయాడు. అంతేకాక తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపాడు. ఇకపోతే ఈ వ్యవహారంపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. ప్రవీణ్, దీపక్ మధ్య జరిగిన గొడవపై దర్యాప్తు ప్రారంభించామని.. ప్రవీణ్ తప్పు చేసినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తన కంప్లైంట్‌ను నమోదు చేసుకునేందుకు పోలీసులు నిరాకరించినట్లు తెలిపాడు. ప్రస్తుతం కేసునమోదు చేసుకున్నారని, అయితే ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నట్లు తెలిపాడు.
మరోవైపు ఈ ఘటనపై ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీపక్, ప్రవీణ్ ఇద్దరూ ఇరుగుపోరుగువారని, ఈ ఘటనపై ఇద్దరూ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు.గతేడాది అక్టోబర్‌లో అన్నిఫార్మాట్లలోనూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ప్రవీణ్ కుమార్ రిటైరయ్యాడు. నిజానికి 2012 మార్చి నుండే ప్రవీణ్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక టీమిండియాలో అవకాశం లభించే చాన్స్ లేకపోవడంతో తను రిటైర్మెంట్ తీసుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. 2007 నవంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ప్రవీణ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మార్చి 30, 2012లో సౌతాఫ్రికాపై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఐదేళ్ల తన కెరీర్‌లో ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి112 వికెట్లు తీశాడు.
Be the first to comment on "తాగి రోడ్డుమీద గొడవ పడిన మాజీ క్రికెటర్"