ఇండియా vs వెస్టిండీస్: 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించిన భారత్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం భారత్ మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ల్లో  బౌండరీల వర్షం కురిసింది. భారత్, వెస్టిండీస్ క్రికెటర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడి భారీ షాట్లు కొట్టటంతో.. మొదటి  టీ20లో ఏకంగా 416 పరుగులు చేసారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (94 నాటౌట్: 50 బంతుల్లో 6×4, 6×6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (62: 40 బంతుల్లో 5×4, 4×6) రెచ్చిపోవడంతో లక్ష్యాన్ని భారత్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరుగుతుంది.  208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కి మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ (8: 10 బంతుల్లో 1×4) ఆరంభంలోనే అవుటయ్యాడు. 

తరువాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకునే వరకూ బ్యాట్ ఝళిపించలేదు. కానీ.. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్ నెట్‌ రన్‌రేట్ పెరగకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే.. కేఎల్ రాహుల్ ఔట్ తర్వాత బ్యాట్ ఝళిపించిన విరాట్ కోహ్లీ ఆఖరి వరకూ ఏమాత్రం జోరు తగ్గించలేదు. మధ్యలో రిషబ్ పంత్ (18: 9 బంతుల్లో 2×4), శ్రేయాస్ అయ్యర్ (4: 6 బంతుల్లో) వికెట్లు చేజార్చుకున్నా.. మొక్కవోని పట్టుదలతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 18.4 ఓవర్లలోనే టీమిండియాకి 209/4తో విజయాన్ని అందించాడు. ముందు హిట్టర్ హిట్‌మెయర్(56: 41 బంతుల్లో 2×4, 4×6), ఓపెనర్ ఎవిన్ లావిస్ (40: 17 బంతుల్లో 3×4, 4×6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్ సిమన్స్ (2)తో కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎవిన్ లావిస్ తొలి ఓవర్‌ నుంచే బాదుడు మొదలెట్టాడు.

Be the first to comment on "ఇండియా vs వెస్టిండీస్: 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించిన భారత్"

Leave a comment

Your email address will not be published.


*