ఇండియా vs న్యూజిలాండ్ మూడవ ODI: ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్

ఈ సంవత్సరం మన భారత క్రికెట్ టీం కు ఇప్పటి వరకు చాలా బాగా కలిసొచ్చిందనే మనం చెప్పుకోవాలి. జనవరి మొదటి వారం లో ఆస్ట్రేలియా తో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ను కైవసం చేసుకున్న మన విరాట్ కోహ్లీ సేన, ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తో కొనసాగుతున్న ఐదు మ్యాచ్ ల ODI సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది మన భారత జట్టు.

న్యూజిలాండ్ దేశం లోనే జరుగుతున్న ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లను అతి సునాయాసం గా తన ఖాతా లో వేసుకున్న మన జట్టు, ఇప్పుడు మిగిలి ఉన్న రెండు వన్ డే ఇంటెర్నేషనల్స్ ని కూడా కైవసం చేసుకుని మొత్తం సిరీస్ ని తమ పేరిట వేసుకోవడానికి మన ఆటగాళ్లు తహ తహ లాడుతున్నట్లు కనిపిస్తున్నారు మరి.

అయినప్పటికీ, ఈ సిరీస్ లో మన జట్టు యొక్క విజయం నేటి ఆటతోనే లాంఛనమయిపోయినప్పటికీ, మన ఆటగాళ్లు మిగతా రెండు మ్యాచ్ ల కోసం కూడా కష్ట పడుతున్నారు. ఇక ఇవాళ న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగానూయి లో జరిగినటువంటి మూడవ ODI లో మొదట బాటింగ్ లోకి దిగిన మన ప్రత్యర్థులు, నలభై తొమ్మిది ఓవర్ల కే చతికల పడిపోయారని చెప్పుకోవాలి.

ఎందుకంటే, ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జట్టు యొక్క మొత్తం వికెట్లను పడగొట్టి ఒక గొప్ప ఆట తీరును ప్రదర్శించారు మన భారత బౌలర్లు. మొత్తానికి మొదటి ఇన్నింగ్స్ ముగిసే సరికి నలభై తొమ్మిది ఓవర్ల లలో న్యూజిలాండ్ 243 పరుగులను చేసి మన వాళ్లకు 244 పరుగులను టార్గెట్ గా సెట్ చేసింది.

అయితే, ప్రత్యర్థులకు కేవలం నలభై ఒక్క పరుగులను మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసి మరో సారి ఒక గొప్ప బౌలర్ గా నిరూపించుకున్నాడు మహమ్మద్ షమీ. అందుకే, మహమ్మద్ షమీ కి మాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అయితే, నలభై పరుగులను ఇచ్చి భారత్ యొక్క రెండు వికెట్లు పడగొట్టగలిగిన ట్రెంట్ బౌల్ట్ కూడా చాలా మంచి ప్రదర్శన ఇచ్చాడనే మనం చెప్పుకోవాలి.

ఇక మన భారత జట్టు యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే, రోహిత్ శర్మ అరవై రెండు (62) పరుగులను సాధించి  మరో సారి తన సత్తా చాటగా విరాట్ కోహ్లీ కూడా అతనికి తోడై జట్టు ని విజయ తీరాల వైపు నడిపించారు. డెబ్భై నాలుగు బంతుల్లో అరవై పరుగులను చేసిన విరాట్, రోహిత్ తో కలిసి 113 పరుగుల భాగస్వామ్య స్కోర్ ను రికార్డు చేయగలిగాడు.

ఇదిలా ఉండగా, అంబటి రాయుడు నలభై పరుగులను చేసి నాట్ అవుట్ గా నిలవగా, దినేష్ కార్తీక్ కూడా ముప్పై ఎనిమిది పరుగులు ఛేదించి నాట్ అవుట్ గా నిలిచాడు. వీరు ఇరువురు కూడా నేటి భారత జట్టు గెలుపులో కీలకం గా వ్యవహరించారనే మనం భావించాలి. మన ఓపెనర్ లు అయిన శిఖర్ ధావన్ ఇంకా రోహిత్ శర్మ ఇరువురు ముప్పై తొమ్మిది పరుగుల భాగస్వామ్య స్కోర్ ను నమోదు చేయగా, ట్రెంట్ బౌల్ట్ ఇరవై ఎనిమిది (28) పరుగులను తన ఖాతా లో వేసుకున్న శిఖర్ ధావన్ యొక్క వికెట్ ను తీసాడు. ఆ తరువాత, రోహిత్ శర్మ తో జోడీ కట్టిన విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో తమకు తిరుగు లేదు అనే విధం గా తనదైన శైలి లో ఆట తీరును ప్రదర్శించి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.

ఇక గురువారం నాడు న్యూజిలాండ్ జరుగుతున్న రసవత్తరమైన ఈ వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లోని నాలుగవ మ్యాచ్ హామిల్టన్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది.

Be the first to comment on "ఇండియా vs న్యూజిలాండ్ మూడవ ODI: ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్"

Leave a comment

Your email address will not be published.


*