భారత్ లో జరుగుతున్న టెస్టుల్లో టీమిండియా ఆధిపత్యం బంగ్లాదేశ్‌పైనా కొనసాగుతోంది. ఈ మధ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులోనూ విజయానికి బాటలు వేసింది టీమిండియా. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28×4, 8×6) డబుల్ సెంచరీ కొట్టడంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 493/6తో నిలిచింది. టెస్ట్ మ్యాచ్ల్లో రెండో రోజైన శుక్రవారం మూడో సెషన్‌లో సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ మార్క్‌ని అందుకున్న మయాంక్ అగర్వాల్.. టీమిండియా కూడా వరుసగా నాలుగు టెస్టుల్లోనూ నాలుగు డబుల్ సెంచరీలు నమోదు చేసిన మొదటి జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ తరహాలో ఏ జట్టు కూడా వరుసగా డబుల్ సెంచరీలు నమోదు చేయలేదు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 86/1తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన టీమిండియా.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28×4, 8×6) డబుల్ సెంచరీ బాదడంతో 493/6తో తిరుగులేని స్థితిలో ఈరోజు ఆటని ముగించింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (60: 76 బంతుల్లో 6×4, 2×6), ఉమేశ్ యాదవ్ (25 బ్యాటింగ్: 10 బంతుల్లో 1×4, 3×6) ఉండగా టీమిండియా 343పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ ఆటే బాగా హైలైట్ అయ్యింది. తొలి సెషన్‌లో చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9×4)తో కలిసి ఆచితూచి అట ఆడిన మయాంక్ అగర్వాల్.. రెండో సెషన్‌లో గేర్ మార్చి బౌండరీల మోత మోగించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌటైన తర్వాత మయాంక్ మరింత బాధ్యతగా ఆడటం కనిపించింది. నాలుగో వికెట్‌కి వైస్ కెప్టెన్ అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9×4)తో కలిసి 190 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్ అగర్వాల్.. 183 బంతుల్లో సెంచరీ, 304 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు.
Be the first to comment on "ఇండియాVsబంగ్లాదేశ్ : 343పరుగుల ఆధిక్యంలో భారత్.. డబుల్ సెంచరీ కొట్టిన మయాంక్ అగర్వాల్.."