రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా పై భారత్ విజయం

క్షిణాఫ్రికాతో పుణెలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఫాలోఆన్ ఆడిన సఫారీలు మూడో సెషన్ ప్రారంభంలోనే 189 పరుగులకి ఆలౌటయ్యారు. దీంతో.. మూడు టెస్టుల సిరీస్‌ని ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ జట్టు 2-0తో కైవసం చేసుకుంది. గత ఆదివారం విశాఖపట్నం వేదిక గా ముగిసిన తొలి టెస్టు‌లో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇక మూడో టెస్టు మ్యాచ్ రాంచీ వేదికగా శనివారం నుంచి జరగనుంది.

గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు మొదటి  ఇన్నింగ్స్‌ని 601/5తో డిక్లేర్ చేయగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 275 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. 326 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. ఈరోజు సఫారీలను ఫాలోఆన్ ఆడించి.. వారిని 189 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (254 నాటౌట్: 336 బంతుల్లో 33x4, 2x6)కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ స్పెల్‌లో ఉమేష్ తన డెలివరీలలో ఎక్కువ భాగం లెగ్ సైడ్‌లోకి దూసుకుపోతున్నాడు మరియు ఇది నిజంగా అతనికి అనుకూలంగా పనిచేసింది. మరోసారి అతను దానిని పూర్తిగా మరియు లెగ్ సైడ్ బౌలింగ్ చేశాడు, 

326 పరుగుల లోటుతో ఈరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోయారు. ఓపెనర్ మర్‌క్రమ్ (0) తొలి ఓవర్‌లోనే డకౌటవగా.. అనంతరం వచ్చిన డిబ్రయిన్ (8), డుప్లెసిస్ (5) తేలిపోయారు. కానీ.. కాసేపు క్రీజులో నిలిచిన ఓపెనర్ డీన్ ఎల్గర్ (48: 72 బంతుల్లో 8×4), బవుమా (38: 63 బంతుల్లో 4×4, 1×6) పరువు నిలిపే ప్రయత్నం చేశారు. కానీ.. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్ (3/22), రవీంద్ర జడేజా (3/52), అశ్విన్ (2/45) దెబ్బకి వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్న సఫారీ టీమ్.. 67.2 ఓవర్లలో 189 పరుగులకి ఆలౌటైంది. రెండో సెషన్‌లో ఫిలాండర్ (37), కేశవ్ మహరాజ్ (22) కాసేపు భారత బౌలర్లని విసిగించారు.

Be the first to comment on "రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా పై భారత్ విజయం"

Leave a comment

Your email address will not be published.


*