మొదటి రోజు 202 /0 పరుగులు చేసిన టీమిండియా…

భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం విశాఖపట్నంలో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌‌లో మొదటి రోజు వర్షం పడటం వల్ల రెండు సెషన్ల ఆట మాత్రమే జరిగింది. మ్యాచ్‌ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ (115 బ్యాటింగ్: 174 బంతుల్లో 12×4, 5×6) అజేయ సెంచరీ కొట్టడంతో అటలో 59.1 ఓవర్లు పూర్తయే టైంకి  202/0 తో నిలిచింది. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని ఆపివేశారు. ఆటలో రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (84 బ్యాటింగ్: 183 బంతుల్లో 11×4, 2×6) ఉన్నాడు.

భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ కెరీర్‌లో మొదటసారి టెస్టుమ్యాచ్ల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ.. అజేయ శతకంతో చెలరేగిపోయాడు. క్రీజులో కుదురుకునేందుకు ఆరంభంలో కొంత టైమ్ తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తర్వాత క్రీజు వెలుపలికి వచ్చి మరీ భారీ సిక్సర్లు బాదాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో చక్కగా బ్యాట్‌ఫుట్‌పైకి వచ్చి పాయింట్ దిశగా బౌండరీలు బాదిన ఈ ఓపెనర్.. ఫాస్ట్ బౌలర్లకి ఫుల్ షాట్స్‌తో సమాధానమిచ్చాడు. ఈరోజు ఆట ముగిసే వరకూ రోహిత్ శర్మని నిలువరించేందుకు వరుసగా బౌలర్లని మార్చినా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ ఫలితం రాబట్టలేకపోయాడు.

వెస్టిండీస్‌పై ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో హాఫ్ సెంచరీ బాదిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. ఈరోజు మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మకి చక్కటి సహకారం అందిస్తూనే అర్ధశతకం సాధించాడు. ఒక ఎండ్‌లో రోహిత్ దూకుడు చూసిన మయాంక్ కూడా.. రెండు సిక్సర్లు బాదడం విశేషం. ఈ ఓపెనర్ల జోరుతో సఫారీ బౌలర్లు మరింత ఒత్తిడిలో పడిపోయారు. దీంతో.. లయ తప్పిన వారి బౌలింగ్‌ని ఉతికారేసిన రోహిత్- మయాంక్ జోడీ.. తొలి రోజు మొదటి వికెట్‌కి అజేయంగా 202 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత్ జట్టుకి టెస్టుల్లో తొలి వికెట్‌కి శతక భాగస్వామ్యం లభించడం గత 25 ఇన్నింగ్స్‌ల్లో ఇదే తొలిసారి కావడం కొసమెరుపు. దక్షిణాఫ్రికా స్పిన్నర్లని సమర్థంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. పాస్ట్ బౌలర్లని ఉతికారేశాడు. దీంతో.. ఏ దశలోనూ సఫారీ జట్టు ఈ ఓపెనర్‌పై ఒత్తిడి పెంచలేకపోయింది. ఆ తర్వాత క్రమంగా రోహిత్ శర్మ గేర్ మార్చడంతో.. 98 బంతుల్లోనే 100 పరుగులు, 74 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ని భారత్ అందుకోవడం విశేషం.

Be the first to comment on "మొదటి రోజు 202 /0 పరుగులు చేసిన టీమిండియా…"

Leave a comment

Your email address will not be published.


*