టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆఖరిదైనా మూడో టెస్టు శనివారం రాంచీలో జరగనుంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ) కొత్తగా ఆలోచించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం ఉచితంగా 5000 టికెట్లను కేటాయించింది. రాంచీలో జరుగుతున్నరెండో టెస్టు అవడంవల్ల యూనిఫాం వేసుకుని దేశానికి సేవ చేస్తున్నవారికి కూడా ఫ్రీగా టికెట్లు ఇవ్వాలని జేఎస్‌సీఏ నిర్ణయం తీసుకుంది. దీని గురుంచి జేఎస్‌సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ మాట్లాడుతూ “సీఆర్పీఎఫ్ జవాన్లు, సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం 5000 టికెట్లు కేటాయించాము” అని చెప్పాడు “యూనిఫాంలో ఉన్న పురుషులకు ఇదే మేము ఇచ్చే గౌరవం. దీంతో పాటు వివిధ జిల్లాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా మేము టికెట్లు అందించాం” అని జేఎస్‌సీఏ కార్యదర్శి సంజయ్ సహాయ్ చెప్పాడు. భారత ఆర్మీకి భారత క్రికెట్ ఘన నివాళి అందించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి లో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినందుకు వీర జవాన్లకు నివాళిగా టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించి ఆడిన సంగతి తెలిసిందే.
భారత ఆర్మీలో లెప్ట్‌నెంట్ గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చేతుల మీదుగా జట్టులోని మిగితా ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్‌లను అందించాడు. అప్పట్లో ఈ విషయం పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే, బీసీసీఐ అనుమతి తీసుకునే క్యాప్‌లను ధరించిందని ఐసీసీ తెలపడంతో వివాదం అక్కడితో ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా క్రికెటర్లకు వేర్వేరు హోటళ్లలో రూమ్స్ కేటాయించడంలో మా పాత్రేమీ లేదని జేఎస్‌సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ అన్నాడు. రాంచీ స్టేడియానికి 13 కిలోమీటర్ల దూరంలో సఫారీలకు, 9 కిలోమీటర్ల దూరంలో టీమిండియాకు విడిది ఏర్పాటు చేశారు. సాధారణంగా రెండు జట్లు ఒకే హోటల్‌లో స్టే చేస్తాయి. అయితే, ఈసారి దానికి వ్యతిరేకంగా రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈసారి డాక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుండటం వల్ల ఇలా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సంజయ్ సహాయ్ చెప్పాడు. “రూమ్స్ ను సంవత్సరం ముందుగానే బుక్ చేస్తారు. ఏదేమైనప్పటికీ రూమ్స్ బుక్ చేసింది బీసీసీఐ, మేం కాదు. అని సంజయ్ అన్నారు. ఇదిలా ఉంటే, జేఎస్‌సీఏ స్టేడియం కెపాసిటీ 39000. ఈ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఇది.
Be the first to comment on "భారత్ vs దక్షిణాఫ్రికా, 3వ టెస్ట్ : సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు ఆర్మీమెన్లకు 5000 ఫ్రీ మ్యాచ్ టికెట్లు"