పుణె లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియాకి మరియు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ని 601/5 వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ పరుగులు 273/3తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (254 నాటౌట్: 336 బంతుల్లో 33×4, 2×6) అజేయ డబుల్ సెంచరీ కొట్టడంతో టీమిండియా ఎక్కువ స్కోరు నమోదు చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఈరోజు రవీంద్ర జడేజా కూడా(91: 104 బంతుల్లో 8×4, 2×6), అజింక్య రహానె (59: 169 బంతుల్లో 8×4) అర్థ సెంచరీలు కొట్టగా.. మొదటి రోజైన గురువారం మయాంక్ అగర్వాల్ (108), చతేశ్వర్ పుజారా (58) కీలక ఇన్నింగ్స్‌లు కొట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు, కేశవ్ మహరాజ్, ముత్తుసామి రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ జట్టు డిక్లేర్ తర్వాత మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా ఈరోజు ఆట అయిపోయే సమయానికి 36/3 పరుగులతో నిలిచింది.
ఓపెనర్లు డీన్ ఎల్గర్ (6), మార్‌క్రమ్ (0) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటవగా.. బవుమా (8)ని మహ్మద్ షమీ బోల్తా కొట్టించాడు. భారత్ కంటే దక్షిణాఫ్రికా ఇంకా 565 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. క్రీజులో బ్రుయాన్ (20 బ్యాటింగ్), ఆన్రిచ్ నోర్తోజ్ (2 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్‌కి చక్కటి సహకారం అందించిన రహానె కూడా హాఫ్ సెంచరీ బాదడంతో తొలి సెషన్‌లో సఫారీలకి కనీసం ఒక్క వికెట్ కూడా దక్కలేదు. జట్టు స్కోరు 376 పరుగుల వద్ద రహానె ఔటవగా. టీ విరామం తర్వాత టీ 20 తరహా హిట్టింగ్ తో రెచ్చిపోయిన ఈ జోడీ సఫారీ బౌలర్లని ఉతికారేసింది. ఈ క్రమంలో ఐదో వికెట్‌కి అభేద్యంగా 225 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ- జడేజా జోడీ.. భారత్‌ని 601/5తో తిరుగులేని స్థితిలో నిలిపింది. డబుల్ సెంచరీ తర్వాత 250 పరుగుల మైలురాయిని కూడా అందుకున్న విరాట్ కోహ్లీ.. శతకం ముంగిట జడేజా ఔటవగానే ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత్ జట్టు 600పైచిలుకు స్కోరు చేయడం ఇది పదోసారి కావడం విశేషం.
Be the first to comment on "భారతదేశం vs దక్షిణాఫ్రికా 2 వ టెస్ట్ 2వ రోజు హైలైట్స్ : డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ"