జాకోబ్ మార్టిన్ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చును భరించనున్న క్రునల్ పాండ్య

భారత క్రికెట్ లో సుపరిచితుడైన జాకోబ్ మార్టిన్ ప్రస్తుతం చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి మన అందరికి విదితమే. పోయిన సంవత్సరం డిసెంబర్ నెల 28 వ తారీఖున జరిగిన ఒక గోర రోడ్ ఆక్సిడెంట్ అనంతరం జాకోబ్ మార్టిన్ యొక్క ఆరోగ్యం విషమం గా మారింది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత అతని యొక్క కాలేయం ఇంకా మూత్ర పిండాలు చాలా వరకు దెబ్బతిన్నాయని డాక్టర్ లు వెల్లడించారు.

జాకోబ్ మార్టిన్ కి ప్రస్తుతం వడోదరా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్సను అందిస్తున్నట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అతని ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు రోజుకి డెబ్భై వేలకు (Rs.70,000) పైబడి ఉంటోందని ఆ ఆస్పత్రి యొక్క సిబ్బంది వెల్లడించారు. అయితే, జాకోబ్ మార్టిన్ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదని, ట్రీట్మెంట్ కోసం అయ్యే అంత ఖర్చు ను తాము భరించలేని స్థితి లో ఉన్నామని అతని బంధువులు ఇంకా కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.

విశేషం ఏంటంటే, జాకోబ్ మార్టిన్ కి జరిగిన ఈ సంఘటన గురించి తెలియగానే వెంటనే స్పందించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ సంజయ్ పటేల్, ఆర్థిక సహాయం అందించవలసిందిగా ప్రతీ ఒక్కరిని కోరి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. భారత క్రికెట్ జట్టు లో ప్రస్తుతం బాగా రాణిస్తున్న ఆటగాడు అయిన క్రునల్ పాండ్య సంజయ్ పటేల్ ఇచ్చిన పిలుపుకు వెంటనే స్పందించి తన వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చాడు.

జాకోబ్ మార్టిన్ ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చును భరించడానికి గాను క్రునల్ పాండ్య ఒక బ్లాంక్ చెక్ ను అతని యొక్క కుటుంబానికి అందించాడని ఇండియా టుడే మీడియా సంస్థ వారికి సంజయ్ పటేల్ వెల్లడించారు. జాకోబ్ మార్టిన్ అతడి కెరీర్ మొదట్లో బరోడా క్రికెట్ టీం కి కెప్టెన్ గా నేతృత్వం వహించేవాడనే సంగతి మన అందరికి తెలిసిన విషయమే.

అయితే, క్రునల్ పాండ్య కూడా 2016 – 2017 వ సంవత్సరానికి గాను జరిగిన రంజీ ట్రోఫీ లో భాగం గా బరోడా క్రికెట్ జట్టు తరుపున ఆడి అందరి మన్ననలను పొందాడు. ఆ తరువాత క్రునల్ పాండ్య భారత క్రికెట్ జట్టు లో ప్రస్తుతం ఏ విధం గా రాణిస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే.

జాకోబ్ మార్టిన్ కి జరిగిన ఆక్సిడెంట్ ను వివరిస్తూ ఇంకా తమ యొక్క ఆర్థిక పరిస్థితిని గూర్చి తెలియజేస్తూ అతని భార్య బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా  (BCCI) కి ఒక లేఖ రాసిందనీ, ఇంకా ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయాన్ని కూడా అందించమని కోరిందని BCCI యొక్క ప్రతినిధులు మీడియా కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు.

విషయం గురించి తెలుసుకున్న వెంటనే స్పందించిన BCCI అధికారులు జాకోబ్ మార్టిన్ ట్రీట్మెంట్ కోసం ఐదు లక్షల (Rs. 5 lakh) రూపాయలను కూడా విడుదల చేసినట్లు వారు వివరించారు. తమ మాజీ క్రికెటర్ సహాయార్థం తక్షణమే స్పందించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారులు కూడా జాకోబ్ మార్టిన్ కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారని సంజయ్ పటేల్ చెప్పుకొచ్చారు.

మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయినటువంటి సౌరవ్ గంగూలీ కూడా తన వంతు సహాయాన్ని అందించగా, ప్రముఖ ఆటగాళ్లైన జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మునఫ్ పటేల్ కూడా తమ తోటి క్రీడా కారుడ్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటన లో ఉన్న భారత క్రికెట్ కోచ్ రవి శాస్త్రి కూడా స్పందిస్తూ జాకోబ్ మార్టిన్ కి భారత క్రికెట్ అండగా నిలుస్తుందని వెల్లడించారు.

Be the first to comment on "జాకోబ్ మార్టిన్ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చును భరించనున్న క్రునల్ పాండ్య"

Leave a comment

Your email address will not be published.


*