ఇండియా vs న్యూజిలాండ్ టీ20: అద్భుతమైన క్యాచ్ పట్టిన దినేష్ కార్తిక్

మొన్నటి వరకు న్యూజిలాండ్ జట్టు తో తలపడిన ఐదు మ్యాచ్ ల వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ను 4 – 1 తేడాతో సుమారుగా క్లీన్ స్వీప్ చేసిన మన భారత జట్టు, నేడు అదే దేశం లో మొదలైన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఒక చేదు అనుభవం తో మొదలు పెట్టిందనే మనం చెప్పుకోవాలి.

మన ఆటగాళ్లు ఫీల్డింగ్ బాగానే చేసినప్పటికీ, న్యూజిలాండ్ యొక్క బ్యాట్స్ మన్ మంచి ప్రదర్శన చేసి మ్యాచ్ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీస్కుని ఈ సిరీస్ లో మొదటి విజయాన్ని అందుకున్నారు. వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ను తమ సొంత గడ్డ పైనే ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన న్యూజిలాండ్, భారత జట్టు ను కనీసం తక్కువ ఓవర్ల ఫార్మాట్ అయిన టీ20 సిరీస్ ని అయినా చేజిక్కించుకోవాలి అనే కసితో ఆడుతోంది.

ఇవాళ జరిగిన ఈ మొదటి 20 ఓవర్ల మ్యాచ్ లో, టాస్ గెలిచి మొదట గా బౌలింగ్ చేయాలని రోహిత్ శర్మ నేతృత్వం లోని మన భారత జట్టు నిర్ణయించింది. అయితే, ముందుగా బౌలింగ్ చేయాలనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ యొక్క ఈ నిర్ణయం బెడిసి కొట్టిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, మన భారత జట్టు ఆటగాళ్లు, ఆటలోని ఏ దశలోనూ ప్రత్యర్థులకు పోటీ ఇవ్వక పోగా, టార్గెట్ ను ఛేదించలేక వారి ముందు చతికల పడ్డారు.

మొదటగా బాటింగ్ చేసిన న్యూజిలాండ్, భారత బౌలర్ లకు చుక్కలు చూపించింది. ఆ జట్టు తరపున ఓపెనర్లు గా బరి లోకి దిగిన టిమ్ సీఫెర్ట్ ఇంకా కోలిన్ మున్రో ఒక గొప్ప ఆట తీరును ప్రదర్శించి మంచి పార్టనర్ షిప్ స్కోర్ ను నమోదు చేసి తమ యొక్క టీం గెలుపులో కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి.

అయితే, భారత బౌలర్ లు మ్యాచ్ ప్రారంభం లో అంటే పవర్ ప్లే అయ్యే వరకు కూడా తీవ్ర ఒత్తిడి కి గురైనప్పటికీ, పవర్ ప్లే తరువాత వారికి రెగ్యులర్ ఇంటెర్వల్స్ లో ఒకదాని తరువాత ఒక వికెట్ పడటం కొంచెం ఊరట ను కలిగించింది అనే చెప్పాలి. ఫీల్డింగ్ లో ఏమాత్రం తడబడకుండా మంచి ప్రదర్శన ఇచ్చిన మన ఆటగాళ్లు, బాటింగ్ విషయం లోనే తీవ్ర ఒత్తిడికి లోనైన విషయం మనకు సుస్పష్టం గా అర్ధం అవుతోంది.

ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్ 219 పరుగుల స్వల్ప టార్గెట్ ను భారత్ కు నిర్దేశించగా మన జట్టు కేవలం 19.2 ఓవర్లలోనే పదికి పది వికెట్లను కోల్పోయి 139 పరుగులను మాత్రమే చేయగలిగి ఒక గోర పరాజయాన్ని చెవి చూసింది. ఇది వరకు జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ లోని నాలుగవ మ్యాచ్ లోనూ మన టీం ఇలాంటి ఒక చెత్త ప్రదర్శన చేసి న్యూజిలాండ్ చేతిలోనే ఓటమి పాలైంది.

ఇక మన అసలు విషయానికి వస్తే, దినేష్ కార్తిక్ ఇవాళ ఫీల్డింగ్ లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఈ అరుదైన క్యాచ్ హార్దిక్ పాండ్య వేసిన 15 వ ఓవర్లో చోటు చేసుకుంది. న్యూజిలాండ్ కు చెందిన డారైల్ మిచెల్, హార్దిక్ పాండ్య వేసిన బాల్ ను రాంగ్ టైమింగ్ లో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించగా, దూరం గా బౌండరీ వద్ద సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న దినేష్ కార్తీక్, ఒక్క ఎత్తున దూకి బాల్ ను అందుకోగా, రోప్స్ కి అవతల కాలు మోపుతానన్న భయం తో మళ్లీ దానిని బౌండరీ కి ఇవతలి వైపు గాలిలోకి విసిరి, మళ్లీ ఒక్క ఎత్తున డైవ్ చేసి బాల్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో మన భారత క్రికెట్ అభిమానుల ఫోన్ లలో చెక్కర్లు కొడుతోంది.

Be the first to comment on "ఇండియా vs న్యూజిలాండ్ టీ20: అద్భుతమైన క్యాచ్ పట్టిన దినేష్ కార్తిక్"

Leave a comment

Your email address will not be published.